హైదరాబాద్: సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపును కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్  దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ను ఆదేశించింది హైకోర్టు. ఈ ఏడాది పిబ్రవరి 5వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు.

Also read:వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు: హైకోర్టు తలుపు తట్టిన వైఎస్ జగన్

 సీబీఐ కేసుల్లో వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో  హైకోర్టులో జగన్  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఏపీ రాష్ట్ర సీఎంగా ఉన్నందున పరిపాలన వ్యవహారాల్లో  బిజీగా ఉన్నందున   ప్రతి వారం వ్యక్తిగత విచారణకు విచారణకు హాజరుకాలేనని  జగన్ మినహాయింపు పిటిషన్ దాఖలు చేయడంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ను హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీకి కోర్టు వాయిదా వేసింది.

ఈ నెల 24వ తేదీన కూడ సీఎం జగన్ కోర్టుకు హాజరుకాలేదు. జగన్ తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజున వ్యక్తిగత హాజరుపై కోర్టు మినహాయింపుపై దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో జగన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై  ఇవాళ  విచారణ జరిగింది.సీబీఐ ఏ రకంగా కౌంటర్ దాఖలు చేస్తోందో చూడాలి. ఈ కేసు విచారణను హైకోర్టు ఫిబ్రవరి ఐదవ తేదీన విచారించనుంది.