హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.  

అయితే తన దీక్షకు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు మద్దతు ప్రకటించలేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా నాయకులు అస్సలు సహకరించలేదని వారిపై మండిపడ్డారు. ఏపిపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డిని సంప్రదించాకే దీక్ష చేపట్టాలని నిర్ణకున్నానని... ఇక్కడ చేయమని ఆయనే చెప్పారని తెలిపారు. కానీ తనకు ఎవ్వరి నుండి సహకారం లభించలేదని వీహెచ్ ఆరోపించారు. 

ఇది తనకు జరిగిన అవమానం కాదని...అంబేద్కర్ కు జరిగిన అవమానమని అన్నారు. పార్టీ తరపున చేపట్టిన ఈ నిరసనకు మద్దతుగా నిలవని ఏపి కాంగ్రెస్ నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని  వీహెచ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అంబేద్కర్ కి జరిగిన అవమానం బాధాకరం: వీహెచ్ నిరసన