కాకినాడ: హైదరాబాద్ లో భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తూ చేసిన అవమానం అందరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు. 

రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, గొప్ప వ్యక్తి అయిన ఆయన విగ్రహాన్ని తరలింపులో తీవ్ర అవమానాలకు గురి చెయ్యడం బాధాకరమన్నారు. అంబేద్కర్ విగ్రహం తరలింపులో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ వీహెచ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరారు. అంబేద్కర్ విగ్రహం తరలింపులో జరిగిన అవమానంపై ప్రజలంతా మేల్కొనాలని ఖండించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు.