శ్రీకాకుళం: కరోనా వైరస్  మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్య సిబ్బందిని స్థానికులు కాలనీలోకి రాకుండా అడ్డుకొన్నారు. దీంతో కమ్యూనిటీ హాల్ లోనే పారిశుద్య సిబ్బంది తలదాచుకొన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కరోనాతో ఒకరు మరణించారు. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను పారిశుద్య సిబ్బంది నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత తమ ఇళ్లకు పారిశుద్య సిబ్బంది వెళ్లారు. అయితే అంబేద్కర్ కాలనీ వాసులు పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్నారు.

also read:తిరుపతిలో దారుణం: కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం జేసీబీతో పూడ్చివేత

కరోనా పరీక్షలు నిర్వహించుకొన్న తర్వాతే నెగిటివ్ ఫలితం వస్తేనే కాలనీలోకి అనుమతి ఇస్తామని స్థానికులు పారిశుద్య సిబ్బందికి తేగేసి చెప్పారు. దీంతో పారిశుద్య సిబ్బంది కమ్యూనిటీ హాల్ లోనే తలదాచుకొన్నారు.

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు పారిశుద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడంతో వీరికి కూడ కరోనా సోకుతోందనే భయంతో స్థానికులు పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్నారు.

ఇదే జిల్లాలో గత నెల 26వ తేదీన కరోనా సోకిన వ్యక్తి  అంత్యక్రియలను జేసీబీతో నిర్వహించడం పెద్ద ఎత్తున  విమర్శలకు తావిచ్చింది. జేసీబీతో అంత్యక్రియలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకొన్నారు.