టీనేజ్ లోనే నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో ఆత్మహత్య...!
వీరిద్దరూ నాలుగేళ్లుగా నాగేంద్ర ఇంటివద్ద సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం నాగేంద్ర దుర్గాదేవి మధ్య ఘర్షణ జరిగింది. నాగేంద్ర మందలించడంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి దాలింపేట వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. lover మందలించాడని ఓ యువతి suicide చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం లోని లచ్చన్న పాలెం శివారు దాలింపేటకు చెందిన పోలవరపు దుర్గాదేవి (18), రోలుగుంట మండలం జెపి అగ్రహారం గ్రామానికి చెందిన దమ్ము నాగేంద్ర ప్రేమించుకున్నారు.
ఈ క్రమంలో వీరిద్దరూ marriage చేసుకుందాం అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పెళ్లి జరగలేదు. దీంతో వీరిద్దరూ నాలుగేళ్లుగా నాగేంద్ర ఇంటివద్ద live in realtion ship చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం నాగేంద్ర దుర్గాదేవి మధ్య ఘర్షణ జరిగింది. నాగేంద్ర మందలించడంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి దాలింపేట వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది.
అయితే, దుర్గాదేవి కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెట్టిన నాగేంద్ర.. కుటుంబసభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారూ వెతకగా..దుర్గా దేవి dead body మండలంలోని పైడిపాల వద్ద లభ్యమైంది. శనివారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు.
ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో బీహార్ లో జరిగింది. కాలేజీలో చదువుకునే సమయంలో ఇష్టపడ్డ ఇద్దరు టీనేజ్ లోనే సహజీవనం చేశారు. అయితే చదువు పూర్తి కాగానే ఆ ప్రేమికుడు అతన్ని నమ్మి జీవితాన్ని అర్పించిన ఆ యువతికి ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో యువతి పోలీసులకు ఆశ్రయించింది.
bihar రాష్ట్ర రాజధాని పట్నాలో అంకుశ్ అనే కుర్రాడు 2019లో బీఏ చదువుకోవడానికి కాలేజీలో చేరాడు. ఆ సమయంలో దివ్య బీ.కాం. చదువుకోవడానికి గ్రామం నుంచి వచ్చి పట్నాలోని కాలేజీలో చేరింది. ఇద్దరికీ సాయంత్రం వేళ libraryలో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అలా లైబ్రరీలో రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకునేవారు.
ఆ పలకరింపులు ప్రేమగా మారింది. అంతే.. ప్రేమించుకున్నాం.. కాబట్టి పెళ్లికి టీనేజ్ లో తమ ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి.. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంకా studies పూర్తి కాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని live-in-relation చేయాలని నిర్ణయించుకున్నారు.
వారిద్దరూ భార్యభర్తలమని చెప్పి ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ankush చదువుతోపాటు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు కూడా రాసేవాడు. అలా వారిద్దరూ మూడేళ్లపాటు తమ చదువుని పూర్తి చేశారు. అదే సమయంలో అంకుశ్ బీహార్ police గా ఉద్యోగం సంపాదించాడు. ఇక తామిద్దరం పెళ్లి చేసుకోవచ్చనుకుంది దివ్య. కానీ అంకుశ్ అప్పుడే పెళ్లి వద్దని చెప్పాడు. అంతేకాకుండా పెళ్లి మాటెత్తిన ప్రతీసారి ఏదో ఒక వంక పెట్టి తప్పించుకునేవాడు.
దీంతో దివ్య మహిళా పోలీస్ స్టేషన్ లో అంకుశ్ మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు అంకుశ్ ని పిలిపించి విచారణ చేశారు. అతడికి కౌన్సిలింగ్ ఇప్పించారు. దివ్యతో పెళ్లికి తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని.. వారు ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని అంకుశ్ పోలీసులతో అన్నాడు. దీంతో ఇరువురి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి కేసును సాల్వ్ చేశారు పోలీసులు.