సాంకేతిక సమస్యలు: ఏపీలో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇవాళ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక సమస్యలతో భూముల రిజిస్ట్రేసన్లు నిలిచిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అధికారులతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కంప్యూటర్లు మొరాయించాయి. ఎప్పటివరకు ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగు కానుందో కూడ అధికారుల నుండి స్పష్టత లేదని రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చినవారంతా చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో భూముల ధరలు పెంచే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన వారంతా ఇబ్బంది పడుతున్నారు.