Asianet News TeluguAsianet News Telugu

సాంకేతిక కారణాలు: బాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విశాఖ నుండి మళ్లీ విశాఖకే

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రయాణించిన  హెలికాప్టర్  సాంకేతిక కారణాలతో  అరకు వెళ్లకుండానే  విశాఖపట్టణానికి చేరుకుంది.

Technical glitches Chandrababu naidus Helicopter in Visakhapatnam lns
Author
First Published Jan 20, 2024, 2:05 PM IST | Last Updated Jan 20, 2024, 2:09 PM IST


అరకు: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ అరకు వెళ్లకుండానే  విశాఖపట్టణం వచ్చింది.సాంకేతిక కారణాలతోనే  ఈ పరిస్థితి నెలకొందని  సమాచారం.  దీంతో కొంతసేపు  గందరగోళ వాతావరణం నెలకొంది. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మండపేట, అరకుల్లో సభలో చంద్రబాబు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. 

అయితే శనివారం నాడు  విశాఖపట్టణం నుండి అరకుకు చంద్రబాబు నాయుడు  హెలికాప్టర్ లో బయలు దేరారు. అయితే అరకు వెళ్లకుండానే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తిరిగి అరకు వచ్చింది. సాంకేతిక అనుమతుల సమస్య కారంగాణ  అరకుకు వెళ్లకుండా హెలికాప్టర్ తిరిగి విశాఖపట్టణం వచ్చింది. విశాఖ పట్టణం నుండి  అరకుకు హెలికాప్టర్ బయలు దేరింది.  సాంకేతిక కారణాలతో  ఏటీసీ సూచన మేరకు  హెలికాప్టర్ తిరిగి విశాఖకు చేరుకుంది.  ఏటీసీ నుండి  అనుమతి రావడంతో  హెలికాప్టర్ తిరిగి  విశాఖపట్టణం నుండి అరకుకు బయలు దేరింది.షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా అరకుకు  చంద్రబాబు చేరుకున్నారు.  దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. 
***

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios