టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆగిపోయింది. చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కామినేని ఆసుపత్రి సమీపంలో కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది.

దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబును భద్రతా సిబ్బంది మరో కారులో హైదరాబాద్‌కు పంపారు. ఇప్పటికే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం 60 వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. ఇందువల్లే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది.