సూట్‌కేసులో భార్య డెడ్‌బాడీ పెట్టి చెరువులో వేసిన టెక్కీ: ఐదు నెలల తర్వాత కేసును చేధించిన పోలీసులు
భార్యను కొట్టి చంపి తన భార్య కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు మాసాల తర్వాత ఈ కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ఇవాళ మృతురాలి డెడ్ బాడీని పోలీసులు వెలికి తీయనున్నారు.
తిరుపతి: Wifeను కొట్టి చంపి తన భార్య కన్పించడం లేదని Policeలకు పిర్యాదు చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు మాసాల తర్వాత భర్తే భార్యను హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు.హత్యకు గురైన వివాహిత మృతదేహన్ని పోలీసులు వెలికి తీయనున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని Tirupatiలో ఈ ఘటన చోటు చేసుకొంది.
తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన Padmaకు, అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ) Venugopal కు 2019లో వివాహమైంది. వీరిద్దరికి వివాహమైన నాలుగు మాసాల తర్వాత నుండి వేణుగోపాల్ భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. వేణుగోపాల్ బయటకు వెళ్లే సమయంలో పద్మను ఇంట్లో ఉంచి బయట నుండి తాళం వేసేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు అప్పట్లోనే ఆరోపణలు చేశారు.
also read:హిందూపురంలో ఘోరం... అనుమానం పెనుభూతమై భార్య, అత్తను కత్తితో పొడిచి హత్యాయత్నం
ఈ వేధింపులు తట్టుకోలేక భర్త నుండి Divorce తీసుకోవాలని పద్మ భావించింది. అయితే రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇరువురిని కలిసి ఉండాలని సర్ధి చెప్పారు. కానీ పద్మ మాత్రం విడాకులు తీసుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే పద్మను భర్త వేణుగోపాల్ కొట్టి చంపాడు. ఆమె మృతదేహన్ని Suit Case లో పెట్టుకొని రేణిగుంటకు సమీపంలోని Venkatapuram వద్ద గల చేపల చెరువులో పడేశాడని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.
ఆ తర్వాత తన భార్య కన్పించడం లేదని వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. వేణుగోపాలే తన భార్య పద్మను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వెంకటాపురం చేపల చెరువులో మృతదేహన్ని వేసినట్టుగా వేణుగోపాల్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. దీంతో చేపల చెరువులో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఈ నెల 27న విషాదం చోటు చేసుకొంది. ఓ టెక్కి దారుణానికి ఒడిగట్టాడు. భార్యా, పిల్లలను ఎలక్ట్రిక్ రంపంతో కోసి, అనంతరం అతడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలోని పల్లవరంలో చోటు చేసుకొంది. అయితే పెళ్లి రోజునే భార్యా పిల్లలను చంపి ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ దారుణానికి పాల్పడ్డారు.
మృతి చెందిన ఇంజనీర్‌ను 41 ఏళ్ల ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే తమ మరణాలకు ఎవరూ బాధ్యులు కాదని మృతుడు సూసైడ్ నోట్ వదిలిపెట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. టెక్కీ భార్య గాయత్రి (39), నిత్యశ్రీ (13), పి హరికృష్ణన్ (8)గా గుర్తించారు. చనిపోయిన ఇద్దరు పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. మరొకరు రెండో తరగతి చదువుతున్నారు.
ప్రకాశ్ మామ రమణన్ ఈ నెల 28న ఉదయం తన కుమార్తె గాయత్రికి ప్రసాదం ఇవ్వడానికి ఇంటికి వచ్చిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను రమణన్ చూశాడు. దీంతో ఒక్క సారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే బాధితులందరి మెడలో కోత గుర్తులు ఉన్నాయి.
ఈ దారుణానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు వివరాలు వెళ్లడించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రకాశ్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య గాయత్రి కూడా స్థానికంగా మూలికా మందుల దుకాణం నడుపుతోంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రకాష్ తన భార్య వ్యాపారం కోసం అప్పులు తీసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆ అప్పును సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెల్లించలేకపోయాడు. అప్పు మొత్తం రూ.10 లక్షల వరకు పెరిగిందని, దీంతో ఏం చేయాలో తెలియక ఇలాంటి ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ముందు వారు తిన్న ఆహారంలో మత్తు మందులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పోలీసులు మిగిలిపోయిన ఆహారపు శాంపుల్స్ సేకరించారు