Asianet News TeluguAsianet News Telugu

హిందూపురంలో ఘోరం... అనుమానం పెనుభూతమై భార్య, అత్తను కత్తితో పొడిచి హత్యాయత్నం

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింట్లో వున్న భార్యతో పాటు ఆమె తల్లిపై విచక్షణారహితంగా కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

man attempt to kill wife and mother in law in hindupuram
Author
Hindupuram, First Published May 30, 2022, 12:22 PM IST

హిందూపురం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన అత్తపై అతి కిరాతకంగా కత్తులతో నరికాడో కసాయి. ఈ దారుణం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడ్డ తల్లీకూతుళ్లు హాస్పిటల్లో చికిత్స పొందతున్నారు. 

వివరాల్లోకి వెళితే... హిందూపురం మోడల్ కాలనీకి చెందిన గౌతమి,శ్రావణ్ భార్యాభర్తలు. ఆరేళ్లక్రితం వీరికి వివాహమవగా నాలుగేళ్ళ కొడుకు వున్నాడు. ఇంతకాలం సాఫీగా సాగిన వీరి సంసారంలో అనుమానం చిచ్చుపెట్టింది. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనను అనుమానిస్తూ భర్త శ్రావణ్ గొడవపడేవాడు. రోజురోజుకి భర్త వేధింపులు మరీ ఎక్కువవడంతో భరించలేకపోయిన గౌతమి పుట్టింటివారి సాయంతో పోలీసులకు ఆశ్రయించింది. 

పోలీసులు నవీన్ ను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై గొడవ పడనని ఒప్పుకోవడంతో అతడి భార్యను వెంట పంపారు. అయితే నవీన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేకుండా ఇంటికి వెళ్లిన నాటినుండి మళ్లీ అనుమానించడం, వేధించడం ప్రారంభించాడు. దీంతో ఇక భర్త నుండి పూర్తిగా విడిపోవాలని భావించిన గౌతమి విడాకుల కోర్టు మెట్లెక్కింది.  

ప్రస్తుతం తన కొడుకుతో కలిసి పుట్టింట్లో వుంటున్నా భార్యను వేధించడం ఆపలేదు శ్రావణ్. తన కొడుకును తనకు ఇవ్వాలంటూ అత్తవారింటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇలా నిన్న(ఆదివారం) కూడా భార్యవద్దకు వచ్చి కొడుకును ఇచ్చేయాలని గొడవపడ్డాడు. ఈ  క్రమంలోనే భార్య గౌతమి, అత్త సుశీలమ్మతో మాటామాటా పెరిగింది. వీరిపై కోపంతో రగిలిపోయిన శ్రావణ్ తమ్ముడు నవీన్ సాయంతో ఇద్దరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమి, సుశీలమ్మ రక్తపుమడుగులో పడిపోగా శ్రావణ్, నవీన్ అక్కడినుండి పరారయ్యారు. గాయపడిన తల్లీబిడ్డలను చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు కలిసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వీరిద్దరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు... ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిందూపురం టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత తల్లీకూతుళ్లు, ప్రత్యక్షసాక్షుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలావుంటే అన్నమయ్య జిల్లాలో మరో దారుణం ఇటీవలే వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్నతండ్రినే అతి కిరాతకంగా చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంచేసి పట్టుబడ్డాడో కసాయి కొడుకు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పోలీసులు తెలిపారు. 

అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. అయితే ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోవడంతో ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పట్టుబట్టాడు. దీంతో సగం ఆస్తిని కొడుక్కి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గరే వుంటున్నాడు. 

దీంతో మిగిలిన సగం ఆస్తిని అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదంపై అనుమానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి బావమరిది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని తేల్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios