గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో ఓ మహిళ మృతదేహం గన్నవరంలో సంచలనం సృష్టించింది. మృతురాలు గన్నవరానికి చెందిన గోచిపుట పుష్పలతగా గుర్తించారు. చెరువు వద్ద  ఆమె హ్యాండ్‌బ్యాంగ్, స్కూటీని కూడ పోలీసులు గుర్తించారు.

పుష్పలతకు ఏలూరుకు చెందిన అనిల్ కుమార్ తో ఎనిమిదేళ్ల క్రితం  పెళ్లైంది. భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో పుష్పలత భర్తకు దూరంగా ఉంటుంది. గన్నవరంలోని తల్లి వద్దే ఉంటుంది.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. శనివారం  సాయంత్రం ప్రెండ్ ను కలిసి వస్తానని  ఇంటి నుండి బయటకు వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఫ్రెండ్ ను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన పుష్పలత మర్లపాలెం చెరువులో శవమై తేలింది. పుష్పలత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.

అనిల్ కుమార్ ను పుష్పలత ప్రేమ వివాహం చేసుకొంది. నాలుగు నెలల నుండి భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా పనిచేసే సమయంలో తమ మధ్య అగాధం ఉందన్నారు. 

సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరిన తర్వాతే  తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని అనిల్ కుమార్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.తన ఫోన్ ను నాలుగు మాసాల నుండి తన ఫోన్ కూడ పుష్పలత లిప్ట్ చేసేది కాదని అనిల్ కుమార్ చెప్పారు.

ఇదిలా ఉంటే తన కూతురు చావుకు అల్లుడు అనిల్ కుమార్  కారణమని ఆరోపించారు. తన కూతురు చావుకు ఆమె భర్త కారణమన్నారు. తన భర్త పదే పదే ఫోన్ చేసి వేధిస్తున్నాడని  పుష్పలత  తనకు చెప్పిందని పుష్పలత తల్లి ఓ తెలుగు న్యూస్ చానెల్ కు చెప్పారు. పుష్పలత సోదరి కూడ  ఆత్మహత్యకు పాల్పడింది.పుష్పలతను ఎవరైనా హత్య చేశారా... లేక ఆత్మహత్య చేసుకొందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.