ఆడపిల్లలు చదువుకోవాలని పాఠశాలలకు వస్తే వారిమీద ఉపాధ్యాయులు కామాంధులై రెచ్చిపోతున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి కామంతో వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇలాంటి ఇద్దరు కీచక ఉపాధ్యాయులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సస్పెండ్ చేశారు.
పార్వతీపురం : కొండలపై బతికే Tribals తమ పిల్లలు ఉన్నతంగా చదువు కోవాలని పాఠశాలలకు పంపిస్తే..ఇద్దరు Teachers మాత్రం కీచకులుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులను తాకుతూ, అసభ్యకర ఫోటోలు తీశారు. వీరి ఆగడాలను భరించలేక పోయిన బాలికలు, తల్లిదండ్రులు కలిసి ఉపాధ్యాయుల దుశ్చర్యలను ప్రస్తావిస్తూ తీసిన వీడియో Social mediaల్లో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. vizianagaram జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 92 మంది students చదువుతున్నారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు ఉండగా ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై బాలికలు ఆరోపణలు చేస్తున్నారు.
ఒంటరిగా ఉన్న సమయాల్లో శరీరాన్ని తాకుతూ ఉన్నారని, Kissలు పెడుతున్నారని, కురచ దుస్తుల్లో వెడితే ఫోటోలు తీస్తున్నారని వాపోతున్నారు. Yoga classes పేరిట పైన చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తల్లిదండ్రులకు చెప్పొద్దని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గ్రామాన్ని సందర్శించి.. గ్రామస్తులు, పాఠశాల కమిటీ సభ్యులతో ఆమె మాట్లాడారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఇండోనేషియాలో ఇలాంటి ఉపాధ్యాయుడికి జీవితఖైదు విధించింది అక్కడి కోర్టు. మానవ రూపంలో ఉన్న మృగంగా మారిన ఓ కీచక Principal ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 13 మంది విద్యార్థినులపై molestation చేశాడు. సభ్యసమాజం ఏమనుకుంటుందో అన్న కనీస విచక్షణ కూడా లేకుండా బాలికల్ని rape చేసి.. వారిలో కొందరిని Impregnate కూడా చేసిన ఈ మృగానికి కోర్టు Life imprisonment విధించింది. ఈ ఘటన Indonesia పశ్చిమ జావాలోని బాండుంగ్ నగరంలో ఓ ఇస్లామిక్ బోర్డు పాఠశాలలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే..
2016 నుంచి 2021 మధ్యకాలంలో.. 11 నుంచి 14 ఏళ్ల వయసు 13 మంది బాలికలపై ప్రిన్సిపల్ హెర్రీ విరావాన్ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. పాఠశాలలోనే కాకుండా బయట హోటల్ గదులు, అద్దె అపార్ట్మెంట్లలో వారిని బెదిరించి.. అఘాయిత్యం చేసినట్లు నేరారోపణలు వచ్చాయి. అతడు చేసిన పాపానికి ఎనిమిది మంది శిశువులు కూడా పుట్టారు. ఇంకా అనేక మంది బాధితులు పోలీసు కేసులతో మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయంతో ఫిర్యాదులు చేయడం లేదని పోలీసులు చెబుతున్నారు.
ఓ బాధితురాలు సెలవులకు ఇంటికి వచ్చి.. ఆ తర్వాత ఓ ఆసుపత్రిలో చేరి బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గత ఏడాది మే నెలలో నిందితుడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. విచారణ సందర్భంగా తన నేరాలను అంగీకరించడంతో పాటు బాధిత విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంలో గత నవంబర్ లో కోర్టులో విచారణ ప్రారంభం అయ్యేంత వరకు కేసు సమాచారాన్ని పోలీసులు బయటకు రానివ్వలేదు.
బాధితులకు మానసికంగా, సామాజికంగా జరిగే నష్టాన్ని నివారించేందుకే తాము ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని పోలీసులు తెలిపారు. బాండుంగ్ జిల్లా కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిందితుడిని దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదు విధించింది. బాధితులకు 23,200 డాలర్లు పరిహారం ఇవ్వాలని.. మహిళా సాధికారత, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. వీటిలో ఒక్కో బాలిక వైద్య, మానసిక చికిత్స కోసం 600 నుంచి ఆరు వేల డాలర్ల వరకు ఇవ్వాలని సూచించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
