ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారు.
భీమవరం : రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాలేదని ప్రాథమిక సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
