విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. నీచంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారులపై  మూడేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడ్డాడు.  చిన్నారులను పాఠశాల బాత్రూమ్ లలోకి తీసుకువెళ్లి మరీ వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలను చిన్నారులకు చూపించి.. వారిని కూడా అలా చేయాలంటూ చెప్పేవాడు. చివరకు విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆ కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని భూమక్కవారిపల్లెలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో  ప్రతాప్ కుమార్(35) అనే ఉపాధ్యాయుడు మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా.. పాఠశాలలో చేరిన నాటి నుంచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కాగా.. ఇటీవల ఓ చిన్నారి నీరసంగా ఇంటికి వెళ్లడంతో.. కారణం ఏమిటని ఇంట్లో వారు ఆరా తీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే.. గ్రామంలోని మహిళలు అంతా.. పాఠశాలకు చేరుకొని.. ఆ కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రతాప్ కుమార్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.