ఈ రోజు ఆంధ్ర రాజకీయాల్లో హైలైట్ ‘ వేస్టు పార్టీ’, ‘వేస్టు పెల్లోస్’
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి అసలైన వెస్ట్ ఫెలో , వాళ్ల పార్టీ కాంగ్రెస్ అంతకన్న వేస్టు అని
టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండి పడ్డారు.
ఆయనకు అంతకోసం రావడానికి కారణం, రఘువీరారెడ్డి తెలుగుదేశం, బిజెపిలను కట్టగట్టి ‘వేస్టు పార్టీలన్నాడు.
విజయవాడ: ప్రధాని,చీఫ్ మినిస్టర్ ఇద్దరు వేస్ట్ ఫెల్లోస్.పొలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం తకట్టుపెట్టింది. పోలవరం పూర్తి చేస్తే నే టీడీపీ,బీజేపీ,2019 వ ఎన్నికలకు అర్హులు.లేక పోతే ఎ1 బీజేపీ పార్టీ, ఎ2 టీడీపీ పార్టీ. బీజేపీ టీడీపీ... వైసీపీ అందరూ దొంగలే.

దాని మీద వర్ల రామయ్య ఇలా స్పందించారు. రామయ్య విసిరిన బాణాలివి:
*125 నియోజకవర్గాలలో నీ పార్టీ కి డిపాజిట్లు రాలేదు నీ పార్టీ వెస్ట్ అన్నారు. ను్వ్వొక వేస్టు ఫెలో.
*నంద్యాలలో మీ పార్టీ కి వచ్చిన ఓట్లు ఎందో ప్రజలకు తెలుసన్నారు.
*కాకినాడ లో ఒక డివిజన్‌లో కూడా ఓట్లు కూడా తెచ్చకోలేని పార్టీ వెస్ట్ . నీవు వెస్ట్ ఫెలో.
*టిడిపి వేస్టు అని అనంతపురంలో అంటే రైతులు తరిమి తరిమి కోడతారు.
*నీ సొంత నియోజకవర్గం డిపాజిట్ లు రా లేదు. నువ్వు వేస్టు.
*పోలవరం అసలు ఎక్కడ ఉందో నీకు తెలియని వెస్ట్ ఫెలో నువ్వు
*వెస్ట్ ఫెలో లసంఘానికి అధ్యక్షుడు రఘవీరా రెడ్డి పెద్ద వేస్టు
అంతటి తో రామయ్య ఆగలేదు. వైసీపి జగన్ పై కూడా ఇలా ఫైరయ్యారు.
*దిక్కు మొక్కు లేని పార్టీ వైసీపి పార్టీ కి కార్యలయంను ప్రారంబిచడానికి కూడ రాలేని స్దితిలో జగన్ ఉన్నారని ఆరోపించారు.
*రాష్ట్రం లో ఎన్ని నియోజకవర్గలు ఉన్నాయొ కూడా తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
*రాజకీయ పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
*సీఎం పదవి అనేది జగన్ కు కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.

