TDP:చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ 10 వేల మందితో టీడీపీ మహా పాదయాత్ర

Chandrababu Naidu's arrest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్ష‌తో చంద్ర‌బాబుపై కుటుంబంపై కుట్రప‌న్నార‌ని మండిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తోంది. 

TDPs 'Maha Padayatra' today condemning Former AP CM and TDP chief N Chandrababu Naidu arrest RMA

Amaravati: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్ష‌తో చంద్ర‌బాబుపై కుటుంబంపై కుట్రప‌న్నార‌ని మండిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తోంది. దీనిలో భాగంగా నేడు చంద్ర‌బాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ నేడు మ‌హా  పాద‌యాత్ర చేప‌ట్ట‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిగూడెంలో 3కే మహా పాదయాత్ర జరగనుంది. పాదయాత్రలో 10 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. జయలక్ష్మి థియేటర్ వద్ద ఉన్న గొర్రెల శ్రీధర్ కాంప్లెక్స్ నుంచి పోలీస్ ఐలాండ్, శేషమహల్ రోడ్డు, ఎన్టీఆర్ చౌక్ మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వీఆర్ సర్కిల్ వరకు పాదయాత్ర సాగనుంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొననున్నారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9న సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుంభకోణం జరిగినట్లు సీఐడీ పేర్కొంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు విడుదల చేసిన రూ.371 కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు.

అయితే, రాజ‌కీయ క‌క్ష‌తోనే చంద్ర‌బాబు కుటుంబంపై కుట్ర‌కు తెర‌లేపార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం వినూత్న నిరసనకు దిగాయి. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా, పొరుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించడం, డప్పులు కొట్టడం, పాత్రలు కొట్టడం, ఈలలు ఊదడం, వాహనాలకు హారన్లు మోగించడం ద్వారా శబ్దం చేశారు.

ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios