అమరావతి: బీజేపీపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ చీలిపోతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చెయ్యలేరన్నారు. బీజేపీ నేతల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని హెచ్చరించారు. 

టీడీపీపై బీజేపీ కుట్రకు ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలే నిదర్శనమంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ పోరాటం చేస్తున్నందునే కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా టీడీపీ పోరాటం ఆగదననారు. 

మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు భేష్ అంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈసీ బాగా పనిచేసిందని ప్రణబ్ మెచ్చుకోవడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.