గుంటూరు: జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన చూసి మిగతా నాలుగేళ్ల పరిపాలన ఎలా భరించాలని ప్రజలు అనుకుంటున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సెటైర్లు విసిరారు. జగన్ చేస్తున్న అరాచక పాలన గురించి సైలెంట్ గా వుంటే సరే... లేకుంటే ఎంతటి వాడైనా పిచ్చివాడు కావాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని... చాలా బయటకు రాకుండా వుండిపోతున్నాయని పేర్కొన్నారు. 

''మొన్న సుధాకర్ సంఘటన మరువక ముందే డాక్టర్ అనితారాణినికి అవమానం జరిగింది.  గోల్డ్ మెడల్ సాధించిన టాప్ ర్యాంకుతో డాక్టర్ చదివిన అనితారాణిని పిచ్చివారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అందరిని పిచ్చివారని ముద్ర వేసున్నారు'' అని మండిపడ్డారు. 

''డాక్టర్ అనితారాణిని గదిలో బంధించి అసభ్యంగా మాట్లాడి సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు. సీఎం జగన్ గారు... నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావు... దళిత డాక్టర్ కు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడెక్కడ ఉన్నారు?'' అని ప్రశ్నించారు. 

''మార్చి 22న అనితారాణి పోలీసు స్టేషన్ లో కంప్లెట్ ఇస్తే ఇప్పుడు సీబీఐకి కేసు అప్పగించి కేసును తారుమారుచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఒక అభాగ్యరాలు గొంతు వినబడలేదా?  మీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే అరెస్టు చేస్తారు.  కానీ దళిత మహిళకు అన్యాయం జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు ఎందుకు పెట్టలేకపోతున్నారు'' అని నిలదీశారు. 

read more   ఇంటికి తాళం.. నా ఇంటికొస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తా: ఏపీ సీఐడీకి అనితా రాణి వార్నింగ్

''ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే  మీ పదవులు కాపాడుకోవడం కోసం బలిచేస్తారా? మీ పదవు కోసం దళిత మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడరా? దళిత హోం మంత్రి, ఉపముఖ్యమంత్రి కనీసం నొరు విప్పలడంలేదు... మీకేందకు ఆ పదవులు'' అంటూ అనిత మండిపడ్డారు. 

''ఇలాంటి పరిపాలన కోసమేనా 3వేల కిలో మీటర్లు నడిచిందన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కును కూడా కొల్పోయారు. జగన్మోహన్ రెడ్డి కి ఓట్లు వేసినందుకు ఉద్యోగులకు తగిన బుద్ది వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే కోర్టుల ద్వారా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది'' అని ఎద్దేవా చేశారు. 

''అన్నగా మహిళలకు అండగా ఉంటారని అనుకున్నాం కానీ రాక్షసుడిలా బలితీసుకుంటారని అనుకోలేదన్నారు. అనితారాణికి న్యాయం జరిగే వారు తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలుగా పోరాటం చేస్తాను. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేక పోయిన చట్టంపై మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం'' అని వంగలపూడి అనిత వెల్లడించారు.