ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి లావణ్యపై దాడి ఘటనే ఉదాహరణ అంటూ తెలుగు దేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై సునీల్ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. జగన్ 20 నెలల పాలనలో 350 మంది  మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయని ఎద్దేవా చేశారు.

దిశ దశ లేని చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మద దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఓ మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే రోజు రోజుకు మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నా అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. 

కడపజిల్లా పొద్దుటూరులో లావణ్య అనే యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తూ.. ఈ రోజు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే.