Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో ఉద్రిక్తత... మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ హౌస్ అరెస్ట్ (వీడియో)

చంద్రబాబు నాయుడికి బెయిల్ రావాలని కోరుకుంటూ దేవాలయాల్లో పూజలకు సిద్దమైన టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా రాష్ట్ర మాజీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేసారు. 

TDP woman leader Nannapaneni Rajakumari House Arrest AKP
Author
First Published Sep 19, 2023, 11:11 AM IST

గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు రావాలని కోరుకుంటూ ఇవాళ టిడిపి నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, క్వాష్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటూ టిడిపి నాయకులు పూజలు చేపడుతున్నారు. అయితే పూజల్లో పాల్గొనేందుకు దేవాలయాలకు వెళ్లనివ్వకుండా టిడిపి నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇలా మాజీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. 

గుంటూరులోని శారదా నగర్ కాలనీ నుండి రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీకి టిడిపి పిలుపునిచ్చింది. అలాగే కొత్తపేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు టిడిపి మహిళలు సిద్దమయ్యారు. అయితే ఈ ర్యాలీకి, దేవాలయంలో పూజలకు అనుమతి లేదంటూ టిడిపి నాయకులను గుంటూరు పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇలా నన్నపునేని రాజకుమారి ఇంటికి తెల్లవారుజామునే చేరుకున్న పోలీసులు నోటీసులు అందించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసారు. 

వీడియో

ఈ సందర్భంగా నన్నపునేని రాజకుమారి మాట్లాడుతూ...  ప్రతిపక్ష పార్టీ నాయకులు స్వేచ్చను హరిస్తూ హౌస్ అరెస్టులు చెయ్యటం బాధాకరమని అన్నారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నానని... కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నానని ఆమె తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తననెంతో  కలచివేసిందని... అందువల్లే ఆరోగ్యం సహకరించకున్నా పోరాటానికి సిద్దమైనట్లు తెలిపారు. ఎంతో పట్టుదలతో టిడిపి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని... ఇలా ఇవాళ గుంటూరులో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి వుందన్నారు. కానీ తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులు అందించి హౌస్ అరెస్ట్ చేసారని నన్నపునేని రాజకుమారి తెలిపారు. 

Read More  హైకోర్టులో చంద్రబాబుపై కేసులపై ఉత్కంఠ: మొద్దు శీను ఉదంతం తెరపైకి..

పోలీసులు అందించిన నోటీసులో అన్నీ అవాస్తవాలే వున్నాయని...  తనపై కేసులు ఉన్నాయని పేర్కొనడం దారుణమని అన్నారు. తెనాలిలో తనపై ఎటువంటి కేసులు లేవని తెలిపారు. రెండ్రోజుల క్రితమే మహిళలు భారీ ధర్నా చేపట్టి గుంటూరు కారం రుచి చూపించి వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్నారు. కట్టడి చేసేకొద్ది కట్టలు తెంచుకొని ప్రవాహం ఎక్కువ అవుతూనే ఉంటుందని నన్నపునేని రాజకుమారి హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios