నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గోన్న వేణు మాధవ్  నంద్యాల ఎన్నికల్లో టీడీపీనే గెలుస్తుందన్న వేణుమాధవ్

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచి తీరుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ హాస్యనటుడు వేణుమాధవ్. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వేణుమాధ‌వ్‌ నంద్యాల్లో ఉప ఎన్నిక ప్ర‌చారం లో పాల్గోన్నారు.

భూమా కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని వేణు చెప్పారు. ఆయ‌న మీద ఉన్న‌ అభిమానమే తనను నంద్యాలకు రప్పించిందని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపించడమే భూమా నాగిరెడ్డికి సమర్పించే ఘన నివాళి అని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 37వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వేణుమాధవ్ పాల్గొన్నారు. టీడీపీ ఈ ఉప ఎన్నిక‌లోనే కాదు, 2019 సాదారణ ఎన్నిక‌ల్లో కూడా విజ‌యం సాధిస్తుంద‌ని వేణుమాధ‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు.