ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగానే తెలుగుదేశంపార్టీ కేంద్రప్రభుత్వంపై దాడులు చేస్తోంది. ఏపికి కేంద్రం చేసిన అన్యాయంపై ఇప్పటికే టిడిపి పోస్టర్లు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని మొదలుపెట్టిన సరికొత్త ప్రచారం వైరల్ గా మారింది. నేని ‘కేంద్రం చెప్పింది..ఇచింది’? అనే క్యాప్షన్ తో వాట్సప్ ద్వారా చేస్తున్న దాడి అందరినీ ఆకట్టుకుంటోంది.

లోక్ సభ సభ్యుడైన నాని సహచర ఎంపిలతో పాటు రాజ్యసభ సభ్యుల అందరికీ తన వాట్సప్ నుండి మెసెజేస్ పంపుతున్నారు. విభజన చట్టంలో రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై ఎంపీ కేశినేని నాని వాట్సాప్‌ ద్వారా పోస్ట్‌ను షేర్ చేశారు.

అలాగే, తన ఫేస్‌బుక్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై దేశంలోని పార్లమెంటు సభ్యులందరికీ తెలియజేయాలని, బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తూ మెసేజ్ అందుకున్నవాళ్ళ మధ్య చర్చ జరుగుతోంది.