Asianet News TeluguAsianet News Telugu

రోజా కార్చిన కన్నీరు అంతా డ్రామా.. ఆ నీచ సంస్కృతిని ఆమెనే తీసుకొచ్చింది: వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామాయేనని, అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని సెటైర్లు వేశారు.

tdp vangalapudi anitha strong Counter to minister Roja ksm
Author
First Published Oct 4, 2023, 3:43 PM IST | Last Updated Oct 4, 2023, 3:43 PM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామాయేనని, అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని సెటైర్లు వేశారు. రోజా గతంలో ఏం మాట్లాడిందో.. పాత వీడియోలు చూస్తే తెలుస్తుందని అన్నారు. అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టారని... ఇపుడు మద్యం ఏరులై పారుతున్న ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వంగలపూడి అనిత బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. 

మంత్రి రోజా లాంటి మహానటిని చూస్తే నవ్వు వస్తోందని అనిత అన్నారు. అసభ్య పదజాలానికి కేరాఫ్‌ అడ్రెస్సే రోజా అని.. మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నీచ సంస్కృతికి తీసుకొచ్చిందే ఆమె అని విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా రోజా తనపై ఇష్టానుసారంగా మాట్లాడిందని.. అసభ్యరమైన వ్యాఖ్యలు చేసిందని.. అప్పుడు తాను, తన పిల్లలు పేపర్, టీవీలు చూడటానికి భయపడిపోయామని.. 10 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదని అన్నారు.  


ఆరోజు తాను ఆడదాన్ని విషయం రోజా మర్చిపోయిందా? అని ప్రశ్నించారు. ఈరోజు రోజాకు ఆవిడ ఆడదాన్నే విషయం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ నేత పీతల సుజాతను బాడీ షేమింగ్ చేస్తూ.. నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన రోజా.. మహిళ అనే సంగతి ఆరోజు రోజాకు గుర్తుకులేదా? అని అడిగారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి వెకిలిగా మాట్లాడితే రోజా ఎందుకు స్పందించలేదని విమర్శించారు.  అలాంటి రోజా ఇప్పుడు  నీతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. 

అమ్మాయిలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, కల్తీ మద్యం, డ్రగ్స్, మద్యపాన నిషేధం గురించి.. ఆడవాళ్ల గురించి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడేందుకు తాను సిద్దమని.. రోజా సిద్దంగా ఉందా? అని సవాలు విసిరారు. పార్టీలను పక్కనబెట్టి ఆడవాళ్లుగా మాట్లాడుదామని అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టారని... ఇపుడు మద్యం ఏరులై పారుతున్న ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని అన్నారు. మంత్రి రోజా ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడారో అందరికీ తెలుసని చెప్పారు. టీడీపీ నేతలు, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి రోజా ఇష్టానుసారంగా మాట్లాడిందని అన్నారు. చంద్రబాబు రిమాండ్ వెళితే సంబరాలు చేసుకుందని విమర్శించారు. మరి రోజా ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదన్నారు. 

తన గురించి వైసీపీ నేతలు మాట్లాడిన దాని గురించి ఫిర్యాదు చేస్తే.. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. టీడీపీ మహిళానేతలపై అసభ్యంగా మాట్లాడితే కేసులు ఉండవా అని ప్రశ్నించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios