అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..కొత్తగా పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపికైన నాయకులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. 

పెదగార్లపాడు మాజీ సర్పంచి అంకులు, ప్రొద్దుటూరు టిడిపి బిసి నేత నందం సుబ్బయ్య హత్యలను సమావేశం ఖండించింది. హత్యలకు గురైన టిడిపి నాయకులు, కార్యకర్తలకు నివాళులు అర్పించారు. 
3 రాజధానుల నిర్ణయంతో మనోవేదనతో మృతి చెందిన అమరావతి రైతులు, రైతుకూలీలకు నివాళులు అర్పించారు. 

కోవిడ్ వల్ల మృతులు, సహజ మరణాలు, ఇతర కారణాలతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై హత్యాకాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు..19 నెలల్లో 16మందిని హత్య చేయడంపై మండిపడ్డారు..జగన్మోహన రెడ్డి దుర్మార్గ రాజకీయం, అనాగరిక రాజకీయం చేస్తున్నారన్నారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితులు లేవన్నారు. ఎవరికీ ఊహకందని విధంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పారు.  హింసా విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. 

మొదట టిడిపి నాయకులపై ప్రారంభమైన దాడులు, ఆస్తుల విధ్వంసాలు చివరికి దేవాలయాలపైన, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం చేస్తున్నారన్నారు. నందం సుబ్బయ్యను ఎస్సీలను పరామర్శించి అన్యాయాన్ని ఖండించడానికి వెళ్తే వాళ్లపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

రామతీర్ధం దుర్ఘటన పరిశీలనకు వెళ్లిన తనపై అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై, 307 హత్యాయత్నం కేసులు పెట్టడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.తన పర్యటనకు అడ్డంగా లారీలు పెట్టి అవరోధాలు సృష్టించారన్నారు. పర్యటనకు అనుమతించిన పోలీసులే మళ్లీ తమపై తప్పుడు కేసులు పెడతారన్నారు.రాష్ట్రంలో 136 దేవాలయాలపై  దాడులకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. రామతీర్థంలో రాములవారి తల తీసేయడం కిరాతక చర్యగా చంద్రబాబు పేర్కొన్నారు.

రామభక్తుడైన సూరిబాబుపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. ఇది సున్నితమైన అంశం. మెజారిటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య. హిందూ దేవుళ్లపై ద్వేషభావం పెంచే శక్తులు ఈ రాష్ట్రంలో ప్రబలడం శోచనీయమని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసమే ఈ అరాచకాలకు తెగబడ్తున్నారు. ఎవరెన్ని అరాచకాలు చేస్తే, విధ్వంసాలు చేస్తే జగన్ రెడ్డి అంత మెచ్చుకుంటాడనే ఉన్మాదంలో ఉన్నారని చెప్పారు.

 ఒక మతం ఆస్తులను ధ్వంసం చేయడం, భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఆచారాలను కించపర్చడం సంప్రదాయాలను ఉల్లంఘించే చర్యలపై ఉదాసీనంగా ఉండటం తప్పుడు చర్యగా ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో 136 దుర్ఘటనలు జరిగితే ఒక్కదానిలో కూడా నిందితులను పట్టుకోలేక పోయారా..?  ఆలయాలపై ఈ విధ్వంస కాండపై స్పందించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా..? ఇంతకన్నా బాధ్యతారాహిత్యం ఉందా..? 
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యలను అన్నివర్గాల ప్రజలు వ్యతిరేకించాలి. ఆలయాలను ధ్వంసం చేయడాన్ని అందరూ గర్హించాలని  చంద్రబాబు పేర్కొన్నారు. 

 అన్నిమతాలను గౌరవించాల్సిన బాధ్యత, దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డిది. అందులో ఘోరంగా విఫలం అయ్యారు.
క్రిస్టియన్ సిఎంగా ఇక జగన్ రెడ్డిపై నమ్మకం లేదు,  కాబట్టి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సిబిఐ విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.

టిడిపి నాయకుల హత్యలు,  తప్పుడు కేసులు పెట్టడంపై చంద్రబాబు మండిపడ్డారు. 19 నెలల్లో 1,336 చోట్ల టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మంది టిడిపి కార్యకర్త హత్యలు చేయడాన్ని ఖండించారు. జెసి ప్రభాకర్ రెడ్డి ప్రాణానికి ఏ హాని జరిగినా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యతగా చెప్పారు. జెసి బ్రదర్స్ కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించాలని సమావేశం తీర్మానించింది. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సంసిద్దంగా ఉండాలితిరుపతి ఉపఎన్నిక,  ఎమ్మెల్సీ ఎన్నికలు,   సంస్థాగత ఎన్నికలు,  జమిలి ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని పోలిట్ బ్యూరో పిలుపు ఇచ్చింది.వైసిపి దుర్మార్గ చర్యలపై అన్నివర్గాల ప్రజలను చైతన్యపర్చాలని తీర్మానం చేశారు. 

గత 19నెలల్లో కేంద్రం నుంచి రాబట్టిన నిధులు, పునర్విభజన చట్టంలో అంశాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్  చేసింది.పెంచిన పన్నులు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని టిడిపి పోలిట్ బ్యూరో తీర్మానం చేసింది.