పాలకొల్లు: తన శ్వాస ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు పాలకొల్లు ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదన్నారు. 

గత కొద్దిరోజులుగా తాను తెలుగుదేశం పార్టీని వీడతానంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అభివృద్ధి పేరుతో తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. 

తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఆ పార్టీకి సేవ చేస్తానని అంతేకానీ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గంలో ఎలా అయితే విజయం సాధించమో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు స్పష్టం చేశారు.