టిడిపి టార్గెట్ జగన్ కాదు..విజయసాయే

టిడిపి టార్గెట్ జగన్ కాదు..విజయసాయే

తెలుగుదేశంపార్టీ వ్యూహాత్మకంగా తన టార్గెట్ ను మార్చుకుంది. కొద్ది రోజుల క్రితం వరకూ చంద్రబాబునాయుడు మొదలుకొని క్రిందిస్ధాయి నేత వరకూ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేపైనే గురి పెట్టేవారు. జగన్ లక్ష్యంగానే ఆరోపణలు, విమర్శలు చేసేవారు. కానీ కొద్ది రోజుల నుండి టిడిపి టార్గెట్ మారినట్లు అనిపిస్తోంది.

చంద్రబాబు నుండి ఏ నేతను కదిపినా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించే మాట్లాడుతున్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా 20 రోజల నుండి ఇదే వరస కంటిన్యూ అవుతోంది. కేంద్రమంత్రివర్గం నుండి మంత్రులు రాజీనామాలు సమర్పించే పరిస్ధితులు రావటంలో విజయసాయిదే ప్రధాన పాత్రగా టిడిపి అనుమానిస్తోంది.

అదే విధంగా ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేలా పొగబెట్టింది కూడా వైసిపి ఎంపినే అట. కేంద్రస్దాయిలో టిడిపికి తగులుతున్న ఇలాంటి చాలా ఎదురుదెబ్బలకు విజయసాయే కారణమని టిడిపి మండిపోతోంది. అందుకే యావత్ టిడిపి మొత్తం విజయసాయంటేనే మండిపోతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos