కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి భేటీ విషయంలో జరిగిన డ్యామేజి కంట్రోలు చేయటంలో టిడిపి అవస్తలు పడుతోంది. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని సుజనా చౌదరి కలిశాడనేదీ అసత్య ప్రచారమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అన్నారు. భేటీపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ సర్టిఫికేట్‌ తీసుకున్న అనంతరం సీఎం రమేష్‌ మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో భాగంగా పనిచేసిన బీజేపీకి ఇప్పుడు అతినీతి కనిపిస్తోందా? అంటూ బీజేపీని నిలదీశారు. బీజేపీ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి లేకుండా పాలన సాగిస్తోందని కితాబిచ్చారు.