Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలు పోతుంటే ఇలా వ్యవహరిస్తారా? వైసీపీ ఎంపీ తీరుపై చంద్రబాబు

హైదరాబాద్‌ నగరంలో వైసీపీ ఎంపీ తీరు చూసి  తాను షాక్‌కు గురయ్యానని, కరోనా వైరస్‌ పరీక్షలు చేయడానికి ఈ ల్యాబ్‌కు ఐసీఎంఆర్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని,  ఈ వైర్‌సను అరికట్టడానికి ముందు వరుసలో ఉండి, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఈ సమయంలో ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 

TDP Supremo Chandrababu Naidu expresses displeasure over YCP MP Balashourie's act
Author
Hyderabad, First Published Apr 25, 2020, 11:45 AM IST

హైదరాబాద్ లోని టెనెట్ డయాగ్నస్టిక్స్ సంస్థకు భారత ప్రభుత్వం కరోనా టెస్టులు నిర్వహించుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక అద్దె భవంతిలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 

ఈ భవంతి వైసీపీ మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సంబంధించినది. ఆయన ఈ ల్యాబ్ కు పరీక్షలకు అనుమతి వచ్చిందని తెలుసుకోగానే వారిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసాడు. వెంటనే ఆ ల్యాబ్ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయిస్తే వారు వెంటనే కలగచేసుకొని తమను ఆదుకున్నారని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

ఇందుకు సంబంధించిన వార్త కథనాన్ని నిన్న ఒక ఆంగ్ల టీవీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ వార్తను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా తాను షాక్ కి గురయినట్టు వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌ నగరంలో వైసీపీ ఎంపీ తీరు చూసి  తాను షాక్‌కు గురయ్యానని, కరోనా వైరస్‌ పరీక్షలు చేయడానికి ఈ ల్యాబ్‌కు ఐసీఎంఆర్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని,  ఈ వైర్‌సను అరికట్టడానికి ముందు వరుసలో ఉండి, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఈ సమయంలో ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios