Asianet News TeluguAsianet News Telugu

నియోజకవర్గానికి 20వేల దొంగ ఓట్లు... అధికార అండతో వైసిపి భారీ కుట్ర: టిడిపి స్ట్రాటజీ కమిటీ సంచలనం

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో అధికార వైసిపి పాలనకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

TDP Strategy Committee Meeting Decisions
Author
Amaravati, First Published Nov 29, 2021, 3:52 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆ పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించిన TDP Strategy Committee పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు: 
 
1.  వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. floods తో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. కష్టంలో ఉన్న వారికి అండగా నిలబడేందుకు ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని ys jagan reddy వ్యాఖ్యానించడం చేతగానితనమే. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ విపత్తుల్లో క్షేత్రానికి ఎందుకు వెళ్తున్నారు? ఫ్లడ్ మేనేజ్ మెంట్ లో ఘోరంగా విఫలయ్యారు. దీనిపై న్యాయ విచారణ జరగాలి. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదు. ఆయా పంటలకు TDP హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని తగ్గించారు. Desaster management నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారిమళ్లించారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని సమావేశలో నేతలు తీర్మానించడం జరిగింది. 

2.  రైతులకు పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి. ఇప్పుడు పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారు. ప్రతిపక్ష నేతగా chandrababu naidu నిలదీసిన తర్వాత అర్థరాత్రి జీవో విడుదల చేశారు. ప్రస్తుతం క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా జగన్ రెడ్డి చేస్తున్న మోసంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని తీర్మానించారు.

3. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. 1983 నుండి 2017 వరకు ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు సంబంధించి డబ్బులు కట్టాలని నిర్ణయించడం దారుణం. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు డబ్బులు కట్టాలని పేదలను వేధిస్తున్నారు. స్వచ్చంధమని ఒకవైపు చెబుతూ.. స్థానిక అధికారుల్ని ఇళ్ల వద్దకు సంక్షేమ కార్యక్రమాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. 

READ MORE  Chandrababu Naidu: సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ.. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్

4. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ సభను జగన్ రెడ్డి కౌరవ సభగా మార్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి.. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చించాలని సమావేశంలో నేతలు తీర్మానించారు.

5. సీఎఫ్ఎంఎస్ ను దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రతి పంచాయతీకి అకౌంట్ ఓపెన్ చేసి వాటి అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. జగన్ రెడ్డి మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా నిధులను పక్కదారి పట్టించి 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరిస్తున్నారు. తక్షణమే ఆయా నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.

6. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో డిపాజిట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడాన్ని సమావేశం ఖండించింది. చట్ట వ్యతిరేకమైన నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల నిధుల మళ్లింపు విద్యావ్యవస్థ ప్రమాణాల్ని దిగజార్చుతుందని అభిప్రాయపడ్డారు. 

7. వృద్ధాప్యంలో డ్వాక్రా మహిళకు ఆర్థిక అండ కోసం తీసుకొచ్చిన అభయ హస్తం పధకాన్నీ జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. ఈ పథకం కింద ప్రతి డ్వాక్రా సభ్యురాలు నెలనెలా రూ.400 నుంచి రూ.500 వరకూ పొదుపు చేస్తారు. డ్వాక్రా మహిళకు రూ.60 ఏళ్లు వచ్చాక అభయ హస్తం నుంచి నెలకు రూ.2000 పెన్షన్లు చంద్రన్న ప్రబుత్వం అందించింది. అప్పుల కోసం అన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. కన్ను అభయహస్తం నిధులపై పడింది. దశాబ్దాలుగా డ్వాక్రా మహిళలు ఈ పథకం కింద ఎల్ ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారు. ఇన్నాళ్లూ పథకం అమలు బాధ్యత చూసిన ఎల్ఐసీని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య అని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు తీర్మానించారు.

video  ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి, జ్ఞానం నేర్పబడును.. విశాఖలో టీడీపీ వినూత్న నిరసన (వీడియో) 0 seconds of 24 secondsVolume 90%

8. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం ప్రకటించింది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ, పెన్షన్, సీపీఎస్ సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అభిప్రాయపడ్డారు.

9. మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో జగన్ రెడ్డి ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా తెలుగుదేశానికి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయి. మున్సిపల్ ఎన్నికలపై రివ్యూ చేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్ లో తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.  

10. ప్రతి నియోజకవర్గంలో 10వేల నుంచి 20 వేల వరకు దొంగ ఓట్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది. దీనిని సమర్థంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ కమిటీలు, బిఎల్ఏల నియామకాలు పూర్తి చేయాలని, డిసెంబర్ చివరి వరకూ ఓటర్ల చేర్పింపు, ఫేక్ ఓట్లు తొలగింపుపై పార్టీ నేతలు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది.

11. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంపై అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి జగన్ రెడ్డి లబ్ధి పొందారు. దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడు అదనంగా టీడీపీపై దాడి చేస్తున్నారు. అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉంది. జగన్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అణచివేతను బలంగా తిప్పికొట్టాలని సమావేశం నేతలు అభిప్రాయపడ్డారు. పాలక పార్టీ నేతల ఒత్తిడికి తలవంచి అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల లిస్టు తయారుచేయాలని నిర్ణయించడమైంది.
 
12. జగన్ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. భవిష్యత్ లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను కాలరాస్తున్నారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 

13. వైకాపా భూతులతో టీడీపీ పోటీ పడదు. మోసకారి సంక్షేమాన్ని.. అంటే అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి, నాన్న బుడ్డి ద్వారా రూ.40 వేలు లాక్కుంటున్న కపటాన్ని ప్రజలకు వివరించాలి. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. ఇలా అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరపున ప్రశ్నించాలని, పోరాడాలని తీర్మానించడమైంది

14. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసి నెలన్నర అవుతున్నా.. మంగళగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం అధికార దుర్వినియోం. దీనిపై ప్రజాక్షేత్రంలోనూ, న్యాయస్థానంలోనూ పోరాడాలని తీర్మానించడమైంది.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు,  యనమల రామకృష్ణుడు,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య,  నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర, కేఎస్ జవహర్,  పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి,  దేవినేని ఉమామహేశ్వరరావు,  ఆలపాటి రాజేంద్రప్రసాద్,  బోండా ఉమామహేశ్వరరావు, బీద రవిచంద్రయాదవ్, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు,  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  బీసీ జనార్థన్ రెడ్డి, గురజాల మాల్యాద్రి, పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios