అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

tdp senior leader expires
Highlights

నివాళులర్పించిన పార్టీ నేతలు

గుంటూరు జిల్లా గొరిజవోలు మండలానికి  చెందిన టీడీపీ సీనియర్ నేత కురుగుంట్ల మస్తాన్‌రెడ్డి(82) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు భార్య రామకోటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సుమారు 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మస్తాన్‌రెడ్డి మార్కెట్‌యార్డు డైరెక్టర్‌గా, గ్రామపార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
 
ఆయన మృతిపట్ల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జీడీసీసీబీ మాజీ చైర్మన్‌ మానం వెంకటేశ్వర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జగన్నాథరెడ్డి, నల్లమోతు హరిబాబు, సీతారామయ్య, వెంకయ్య చౌదరి, కె.సామ్రాజ్యం, మస్తాన్‌రావు, స్వాములు, నాగేశ్వరరావు నివాళి అర్పించారు.

loader