‘‘పవన్ మీకు పవర్ రాదు.. అది అన్న ఎన్టీఆర్‌కే సాధ్యం.. మీకు సీఎం సీటు దక్కదు’’

tdp sc st leaders comments on pawan kalyan
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ దళిత నేతలు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని షెడ్యూల్ 9లో పెట్టి.. ఆ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన దళిత, గిరిజన కవాతులో టీడీపీ దళిత నేతలు పాల్గొన్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ దళిత నేతలు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని షెడ్యూల్ 9లో పెట్టి.. ఆ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన దళిత, గిరిజన కవాతులో టీడీపీ దళిత నేతలు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మంత్రులు నక్కా ఆనందబాబు, జవహర్, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ప్రసంగించారు. దేశంలో సగటున రోజుకి ఆరుగురు దళిత మహిళలపై అత్యాచారం.. ప్రతి 15 నిమిషాలకు ఒక దాడి జరుగుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు రక్షణగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రజరుగుతోందని.. ఈ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక ప్రధాని మోడీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం కచ్చితంగా ఉందని వారు ఆరోపించారు.

ఇంత జరుగుతున్నా ప్రతిపక్షనేత జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు.. మోడీకి ఎదురుతిరిగితే తిరిగి జైలుకి వెళ్లకతప్పదనే దళితులకు జగన్ అన్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే పవన్ పైనా వారు విమర్శలు సంధించారు..

మిస్టర్ పవన్ కల్యాణ్.. సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు.. సీఎం కావాలంటే ప్రజల హృదయాల్లో స్థానం పొందాలని.. అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందని... మీ వల్ల కాదని... మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కుర్చీ దక్కదని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వంపై పోరాటం చేసి ప్రత్యేకహోదా, విభజన హామీలు. రైల్వే జోన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఆర్డినెన్స్‌ను సీఎం నాయకత్వంలో సాధించి తీరుతామని వారు ధీమా వ్యక్తం చేశారు.

loader