ఆదాయంలో టీడీపి జోరు: తగ్గిన టీఆర్ఎస్, వైసిపి ఆదాయం

TDP’s income gets 2nd spot; TRS earnings come down
Highlights

 ప్రాంతీయ పార్టీల ఆదాయ సముపార్జనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జోరు కనబరిచింది.

హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల ఆదాయ సముపార్జనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జోరు కనబరిచింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయాలను లెక్క వేస్తే తెలుగుదేశం పార్టీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 

గత రెండేళ్ల కాలంలో కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల ఆదాయాలు తగ్గాయి. టీఆర్ఎస్ ఆదాయం 2015-16 రూ. 8.908 కోట్లు ఉండగా, 2016 - 17 సంవత్సరంలో రూ.3.79 కోట్లు మాత్రమే ఉంది.  వైసిపి ఆదాయం రూ.1.91 కోట్ల నుంచి 0.94 కోట్లకు తగ్గింది.

తెరాసకు ప్రధాన ఆదాయ వనరులు - సభ్యత్వ నమోదు ఫీజు, విరాళాలు, ఎఫ్ డీ వడ్డీ, బ్యాంక్ వడ్డీ, ఐటి రీఫండ్ పై వడ్డీ, ఎన్నికల వ్యయం రీఫండ్. తెలుగుదేశం పార్టీ తన ఆదాయం 33 శాతం మాత్రమే ఖర్చు చేసింది. ఈ పార్టీ ఆదాయం 2015-16 ఆదాయంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. వైసిపి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. 

తెలుగుదేశం పార్టీ ఫీజు, సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందింది. అది మొత్తం ఆదాయవనరులో 83.31 శాతం. అది రూ.60.75 కోట్లు. ఎన్నికల కమిషన్ కు 2016-17కు సంబంధించి 32 ప్రాంతీయ పార్టీల ఆడిట్ నివేదికల విశ్లేషణ చేస్తే టీడిపి ఆదాయం 2016-17లో 72.92 కోట్ల రూపాయలు ఉంది. ఎన్నికలు, రాజకీయ సంస్కరణల రంగంలో పనిచేస్తున్న ఏడీఆర్ ఈ గణాంక వివరాలను వెల్లడించింది. 

loader