విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశంపార్టీలో  విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణ రంగారావు సొంత నియోజకవర్గం బొబ్బిలిలో టిడిపి కార్యకర్తలకు, ఫిరాయింప మంత్రి అనుచరులకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం జరిగిన కార్యక్రమంలో ఇరువర్గాల నేతలు కొట్టేసుకున్నారు. పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో పాతికేళ్లగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వక పోవటంపై సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మంత్రిని నిలదీశారు.

సమావేశాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని పనులు కూడా తమవర్గం వారికే ఇచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి అనుచరులు కూడా వారికి ఘాటుగా సమాధానమిచ్చారు. దాంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగింది. వెంటనే తోపులాట జరిగింది. దాంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు చొక్కాలు చింపుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.