ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది. సుమారు 25 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విడుదల చేసే అవకాశం ఉంది. పలువురు ఎంపీ అభ్యర్థులను ఇందులో ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. ఏ ఏ స్థానాల్లో ఎవరిని పోటీలోకి దింపాలనే విషయంలో ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చాయి. ఈ నేపత్యంలో వైసీసీ ఆయా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ కూడా ఇప్పటికే తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది.

నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసు.. ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, ఏ సీటులో ఎవరు బరిలో ఉండాలనే విషయమై ఇంకా జనసేన, బీజేపీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాగా, టీడీపీ మాత్రం వారికి సీట్లను కేటాయించి తమ సొంత సీట్లలలో అభ్యర్థులను ప్రకటిస్తున్నది. బీజేపీతో పొత్తు కంటే ముందే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు రెండో జాబితాను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విషయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. గురువారం తమ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు వచ్చిందని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్..

ఇక జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో వారికి స్పష్టత ఉన్నదని చంద్రబాబు నాయుడు తెలిపారు. వారికి అనుకూలమైన సమయంలో ఆ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తాయని వివరించారు. ఈ పొత్తు ప్రజల కోసమే పెట్టుకున్నామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నట్టు? అనే ఆలోచనలు చేయరాదని పేర్కొన్నారు.

బీజేపీ గెలవాలి.. కానీ మోడీ మళ్లీ ప్రధాని కావొద్దు - సుబ్రమణ్యస్వామి

కాగా.. టీడీపీ నేడు సుమారు 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 17 లోక్ సభ స్థానాలపై అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆయన కసరత్తు చేస్తున్నారు. అయితే స్పష్టత వచ్చిన స్థానాల్లో నేడు అభ్యర్థులను ప్రకటించనున్నారు.