నంద్యాల ఎన్నిక‌లో తెలుగు దేశం పార్టీకి ఓట‌మి త‌ప్ప‌దు. వైసీపి నేత‌ల ఇళ్లే ల‌క్ష్యంగా దాడులు. ఎన్నికలు వాయిదా పడేలా ప్రతిపక్షం కుట్ర చెస్తుందనడం హాస్యాస్పదం.
నంద్యాల ఎన్నికలో తెలుగు దేశం పార్టీకి ఓటమి తప్పదని తెలిసి ఆ పార్టి నాయకులు దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు వైసీపి అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ. పోలీసులు వైసీపి నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. నంద్యాల ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం మీడియా మాట్లాడారు.
ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీ శ్రేణుల లెక్కల ప్రకారం టీడీపీ ఓటమి తప్పదని సీఎం గుర్తించారని, అందుకే నంద్యాల ఎన్నికల్లో కుట్రలకు తెరలేపారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు వాయిదా పడేలా ప్రతిపక్షం కుట్ర చేస్తోందంటూ సీఎం మాట్లాడటం కాస్తా విడ్డురంగా ఉందన్నారు. టీడీపీ ఓటమిని ముందుగా గుర్తించే ఇలా విమర్శలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. దొరికితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదని ఆయన అన్నారు. వైసీపి నేతల, ఆర్యవైశ్యుల, రజకుల ఇళ్లపై పోలీసులు ఏకపక్షంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
నంద్యాల్లో ఓక్కొ ఓటుకు రూ.5 వేలు ఇస్తానన్నారని ఆయన ఆరోపించారు. నిజంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబులా దిగజారి మాట్లాడి ఉండరు ఎద్దేవా చేశారు. ఆయన కుట్రలను అడ్డుకోవడానికి వైసీపితో పాటు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇక మీదట ఏ ఎన్నికలు జరిగిన ప్రజలు వైసీపి కి బ్రహ్మరథం పట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
