శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గుండాలు రాళ్లు, కత్తులతో దాడులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
అమరావతి: రాడ్లు, కత్తులు, గొడ్డళ్లతో వైసిపి గుండాలు రోడ్లపై స్వైర విహారం చేస్తూ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం లోక్ సభ వైసిపి అభ్యర్ధి అసభ్యపదాలతో రెచ్చగొట్టి ఈ మూకలను హింసా విధ్వంసాలకు ప్రేరేపించారని న్నారు.
ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర హింసా, విధ్వంసాలకు వేదిక కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసిపి రౌడీ మూకలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసిపి గుండాలకు ప్రజలే మరిచిపోలేని గుణపాఠం త్వరలోనే చెబుతారని అన్నారు.
ఆ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసుల ఎదుటే దుర్ఫాషలాడుడుతున్న దువ్వాడ శ్రీనివాస్ వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Scroll to load tweet…
