2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి ‘ఎల్లోబుక్’ ను సిద్ధం చేస్తోంది. ఆ బుక్ లో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అవలంభించిన వ్యూహాలను, విధానాలను వివరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు ఏర్పాట్లు కుడా జరుగుతున్నాయి. 4 వ తేదీన పార్టీ ముఖ్య నేతలతోను, 5వ తేదీన ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు.

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి ‘ఎల్లోబుక్’ ను సిద్ధం చేస్తోంది. ఆ బుక్ లో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అవలంభించిన వ్యూహాలను, విధానాలను వివరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు ఏర్పాట్లు కుడా జరుగుతున్నాయి. 4 వ తేదీన పార్టీ ముఖ్య నేతలతోను, 5వ తేదీన ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఆ సమావేశంలో ఎల్లోబుక్ అందరికీ పంపిణీ చేయాటానికి ఏర్పాట్లు కుడా జరుగుతున్నాయి లేండి. అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల గెలుపుకు ఈ ఎల్లోబుక్కే రూట్ మ్యాప్ లాగ మార్గదర్శనం చేస్తుందన్నమాట.

ఈనెల 11వ తేదీ నుండి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ‘ఇంటింటికి తెలుగుదేశం’ అనే కార్యక్రమం మొదలవ్వబోతోంది. గడచిన మూడేళ్ళల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఇందులో ఎంఎల్ఏలతో సహా ఆయా నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. అందులోనూ రెండు వరుస ఎన్నికల్లో గిలిచారు కదా పార్టీ శ్రేణులు కుడా ఉత్సాహంగానే పాల్గొంటారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై జనాల నాడిని పట్టుకుంటారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలుపుతో చంద్రబాబు పార్టీలో బాగానే హడావుడి మొదలుపెట్టేసారు.