జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరం: టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం

జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్‌‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకొంది.

TDP politburo decides to boycott in zptc, Mptc elections lns

అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్‌‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకొంది.

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు మధ్యాహ్నం ముగిసింది. ఇవాళ ఉదయం ఆన్‌లైన్ లో ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని మెజారిటీ నేతలు కోరారు.  ఎన్నికల్లో ఎందుకు పాల్గొనడం లేదో సహేతుకమైన కారణాలను  వివరించాలని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

మరికొందరు నేతలు  మాత్రం ఎన్నికల్లో పాల్గొనాలనే అభిప్రాయాన్ని  వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పాల్గొనకపోవడంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులంతా పోటి నుండి విరమించుకోవాలని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకొందని సమాచారం. ఈ విషయమై పార్టీ అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో  పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులపై పార్టీ కేడర్ కు వివరించాలని కూడ   ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు సాధించలేదు. కనీసం పోటీ చేయడానికి కూడ ఆ పార్టీకి అభ్యర్ధులు కూడ దొరకలేదని వైసీీప టీడీపీపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios