వైసిపిని అడ్డుకోవటమే టిడిపి లక్ష్యమా ?

వైసిపిని అడ్డుకోవటమే టిడిపి లక్ష్యమా ?

చూడబోతే కేంద్రప్రభుత్వంపై వైసిపి ప్రవేశపెట్టదలచుకున్న అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుపడటమే టిడిపి ఉద్దేశ్యం లాగ కనబడుతోంది. వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు గురువారం సాయంత్రం బహిరంగంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది శుక్రవారం ఉదయానికి సీన్ ఎందుకు మారిపోయింది?

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయాలని చంద్రబాబు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ చివరి నిముషంలో కేంద్రంపై టిడిపినే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంపైనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు అనుమానాలే నిజమయ్యేట్లున్నాయి.

 ఎందుకంటే, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసిపి ఏ పార్టీల మద్దతైతే కోరుతోందో శుక్రవారం ఉదయం అవే పార్టీల వద్దకు టిడిపి ఎంపిలు కూడా వెళ్ళారు. అంటే అర్దమేంటి? ఒకే అంశంపై రెండు పార్టీలో పోటీ పోటీగా వివిధ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారంటూ చూసే వాళ్ళకి చికాగ్గా ఉండదా?  

టిడిపి ఉద్దేశ్యంలో  ఏ పార్టీ అయినా మద్దతిస్తే తమకే ఇవ్వాలని లేకపోతే ఎవరికీ ఇవ్వకూడదనే ఆలోచనే కనబడుతోంది. దాంతో వైసిపికి మద్దతుగా నిలబడాలనుకున్న పార్టీలు కూడా చివరి నిముషంలో మనసు మార్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్, ఏఐఏడిఎంకె, బిజెడిల్లాంటి పార్టీల ఎంపిలు రెండు పార్టీల పరిస్ధితిని చూసి జోకులేసుకున్నారట పార్లమెంటులో.

పోటీ వల్ల ఏమైంది? పార్లమెంటును స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. బిజెపికి కావాల్సిందదే. ఈరోజే అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓ ప్రకటన చేస్తారని ఉదయం అందరూ అనుకున్నారు. అటువంటిది సభ ఆర్డర్లో లేదన్న కారణంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారమైనా మరో రోజైనా చివరకు జరిగేదదే అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos