మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ: ఈ స్థానాల్లో ఒక్క స్థానం కూడ దక్కలేదు

మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు టీడీపీని చావు దెబ్బతీశాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ఈ ఎన్నికల్లో కన్పించింది. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని తాడిపత్రిలో టీడీపీని జేసీ సోదరులు విజయతీరాలకు చేర్చారు. కొన్ని మున్సిపాలిటీల్లో టీడీపీకి కనీసం ఒక్క స్థానం కూడ దక్కలేదు.

TDP not win single seat in several municipalities lns


అమరావతి: మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు టీడీపీని చావు దెబ్బతీశాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ఈ ఎన్నికల్లో కన్పించింది. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని తాడిపత్రిలో టీడీపీని జేసీ సోదరులు విజయతీరాలకు చేర్చారు. కొన్ని మున్సిపాలిటీల్లో టీడీపీకి కనీసం ఒక్క స్థానం కూడ దక్కలేదు.

ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఈ స్థానంలో టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు.  నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీలో కూడ ఒక్క స్థానం కూడ దక్కలేదు. 25 వార్డులను అధికార వైసీపీ దక్కించుకొంది.

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని 31 వార్దులు ఏకగ్రీవయ్యాయి. ఈ 31 వార్డులు వైసీపీ దక్కించుకొన్నాయి. కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీలో  టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. ఈ స్థానం కేఈ కుటుంబీల హవా ఉండేది. ఈ స్థానంలో ఒక్క స్తానంలో సీపీఐ అభ్యర్ధి విజయం సాధించారు. మిగిలిని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకొంది. టీడీపీకి ఒక్క స్థానం కూడ రాలేదు.

గుంటూరు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీలో 33 వార్డులను వైసీపీ దక్కించుకొంది. ఈ వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో 20 వార్డులను వైసీపీ గెలుచుకొంది.గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలోని 33 వార్డుల్లో కూడ వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. సీఎం జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో ని పులివెందుల మున్సిపాలిటీలోని 33 వార్డులను అధికార వైసీపీ గెలుచుకొంది.

టీడీపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుపొందిన మున్సిపాలిటీలు అతి తక్కువగా ఉన్నాయి. టీడీపీ నేతలు సీరియస్ గా పనిచేసిన స్థానాల్లో ఫలితాలు మరోలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  తాడిపత్రి, నర్సీపట్నం, మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆ పార్టీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios