కడపలో ఉక్కు ఫ్యాక్టరీ: రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు

TDP mp's meets president Ramnath kovind today
Highlights

కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు బుధవారం నాడు  టీడీపీ ఎంపీలు  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు.


న్యూఢిల్లీ: కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు బుధవారం నాడు  టీడీపీ ఎంపీలు  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసినా  కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని  రాష్ట్రపతికి  టీడీపీ ఎంపీలు  చెప్పారు.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని  రాష్ట్రపతి రామ్‌నాథ్‌తో  టీడీపీ ఎంపీలు  బుధవారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన  హామీలను కూడ టీడీపీ ఎంపీలు ప్రస్తావించారు. విభజన హామీ చట్టంలో పొందుపర్చిన అంశాలను కూడ  రాష్ట్రపతితో ప్రస్తావించారు.

ఇదే సమయంలో  ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్నప్పటికీ  కూడ కేంద్రం  మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని టీడీపీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని ఆదేశించాలని టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కోరారు.

తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కూడ ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు టీడీపీ ఎంపీలు గుర్తు చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని ప్రత్యేకంగా చూడాలని  రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. 


 

loader