ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం తారా స్థాయికి చేరుకుంది. వివిధ పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ నేతలు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. 

ఇకపోతే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే రోజుకో వేషాలతో తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ వేషాలలో వివిధ రూపాలతో కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని, నమ్మక ద్రోహి అంటూ పదేపదే ఆరోపిస్తున్నారు. 

ఇకపోతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ టీడీపీ నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అయితే తాజాగా మంగళవారం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక్కరోజునిరాహార దీక్షకు దిగారు. మంగళవారం ఉదయం రామ్మెహన్ నాయుడు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం వరకు కొనసాగుతోంది.