ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘెర పరాజయాన్ని మూట గట్టుకుంది. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ గాలి సృష్టించిన ప్రభజనానికి కొందరు మాత్రమే తట్టుకొని నిలబడగలిగారు. వారిలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు.  శ్రీకాకుళం ఎంపీగా ఆయన రెండో సారి గెలుపొందారు. కాగా... తాజాగా ఆయన నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న అడిగారు.దానికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో... పార్లమెంట్ లో తొలుత తాను ఏ అంశం గురించి చర్చిస్తే బాగుంటుందో చెప్పమని రామ్మోహన్ నాయుడు అభిమానులు, నెటిజన్లను కోరారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ కి అనూహ్య స్పందన వచ్చింది.

ఎక్కువ మంది ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రస్తావించాలని, మోదీ నిలదీయమని సలహా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళానికి అదనపు రైళ్లను నడపాలని అడగమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కొందరు, నిరుద్యోగులకు ఉపాది అవకాశాలపై మాట్లాడాలని ఇంకొందరు విజ్ఞప్తి చేశారు.