Asianet News TeluguAsianet News Telugu

ప్రజా వేదిక కూల్చండి.. కానీ.. కేశినేని నాని

అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

tdp mp kesineni nani response on praja vedhika collapse decision
Author
Hyderabad, First Published Jun 25, 2019, 10:10 AM IST

అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజా వేదికను కూల్చడం వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని ఆయన తన ఫేస్ బుక్ లో వివరించారు.

ప్రజావేదికను ఇప్పటికిప్పుడు తొలగిస్తే ప్రభుత్వ ఖజానాకు రెండు రకాలుగా నష్టం జరుగుతుందని కేశినేని నాని పేర్కొన్నారు. ‘‘‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుంది. మొదటి విషయం.. ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి, అది కూల్చేస్తే ఆ సొమ్ము వృథా అవుతుంది. రెండో విషయం ఏంటంటే, మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుంది’’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios