చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రికి కేశినేని నాని లేఖలు..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కేశినేని నాని లేఖలు రాశారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆయన జీవితంలోని 45 సంవత్సరాలను అచంచలమైన అంకితభావంతో, మచ్చలేని కీర్తితో దేశానికి సేవ చేయడానికి అంకితం చేశారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కేశినేని నాని లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనలో చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు.
చంద్రబాబు నాయుడుపై మోపబడిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవని లేఖలో కేశినేని నాని పేర్కొన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా, చంద్రబాబు హక్కులకు రక్షణ కల్పించేలా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలను కేశినేని నాని ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఆ పోస్టును ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను, రాష్ట్రపతి భవన్ అకౌంట్స్‌ను ట్యాగ్ చేశారు. జస్టిస్ ఫర్ చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యం ముఖ్యం అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా కేశినేని జత చేశారు. అంతేకాకుండా ఏపీ గవర్నర్‌కు కూడా కేశినేని లేఖ రాశారు.