Asianet News TeluguAsianet News Telugu

చట్టాలను గౌరవించరు.. చట్టాలు చేయమంటారా: వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీల ఫైర్

వైసీపీపై (ysrcp) మండిపడ్డారు టీడీపీ (tdp) నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar). వైసీపీ సంస్కారం లేని పార్టీ అని కనకమేడల రవీంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ మాట్లాడటం దురదృష్టకరమని కనకమేడల దుయ్యబట్టారు

tdp mp kanakamedala ravindra kumar slams ysrcp
Author
New Delhi, First Published Nov 2, 2021, 2:33 PM IST

వైసీపీపై (ysrcp) మండిపడ్డారు టీడీపీ (tdp) నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar). వైసీపీ సంస్కారం లేని పార్టీ అని కనకమేడల రవీంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని (president of india) కలిసి టీడీపీపై ఫిర్యాదు చేయడాన్ని తెలుగుదేశం నేతలు (telugu desam party) ఖండించింది. ఈ మేరకు ఢిల్లీలో రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. అధికారంలో లేనప్పుడు.. వచ్చిన తర్వాత చంద్రబాబుపై వైసీపీ నేతలు మాట్లాడిన మాటలను ఆ పార్టీ ఎంపీలు గుర్తు చేసుకోవాలన్నారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ మాట్లాడటం దురదృష్టకరమని కనకమేడల దుయ్యబట్టారు. చట్టాలను గౌరవించని వైసీపీ నేతలు చట్టాలు చేయండని రాష్ట్రపతిని కోరడం విడ్డూరమని రవీంద్రకుమార్‌ అన్నారు. ఏపీలో విష సంస్కృతి నెలకొందన్నారు.

వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక మంత్రులు.. ప్రతిపక్ష నాయకుడిపై చేస్తున్న వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారని విజయవాడ ఎంపీ (vijayawada mp) కేశినేని నాని (kesineni nani) అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని దూషిస్తే శిక్షించేలా చట్టం తేవాలని రాష్ట్రపతిని వైసీపీ నేతలు కోరడాన్ని స్వాగతిస్తున్నానని.. ప్రతిపక్షనేత పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవి అనే విషయం వైసీపీ నేతలకు తెలుసా అని నాని ప్రశ్నించారు. పార్టీ కార్యలయాలపై, నివాసాలపై దాడులు చేసి రాష్ట్రపతిని ఏ విధంగా కలిశారని కేశినేని నిలదీశారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు పూడ్చాలని.. కరెంట్‌ బిల్లులను తగ్గించాలని నాని డిమాండ్ చేశారు. 

Also Read:టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి.. రాష్ట్రపతిని కలిసి వైసీపీ ఎంపీలు

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ,  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. ఈరోజు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం,  పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి (vijayasai reddy) నాయకత్వంలో రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు.

చంద్రబాబు నాయుడు తన పార్టీ అధికార ప్రతినిధులు, తన పార్టీ నేతల చేత ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా నోటితో ఉచ్ఛరించలేని అసభ్యకరమైన, బూతు పదజాలంతో తిట్టించి, తాను తప్పు చేసి, పైగా రాష్ట్రపతిని కలిశారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన  తప్పేంటో, ఆయన ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడో.. రాష్ట్రపతి Ram Nath Kovindకి వివరించడానికి ఈరోజు ఆయనను కలిశామని విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చారని.. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఎలా తాకట్టు పెట్టాడో, ఎలా మంటగలిపాడో చూశామంటూ సాయిరెడ్డి దుయ్యబట్టారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రపతి గారికి వివరించాం అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios