అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పునరావృతం కానున్నాయని  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

మంగళవారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీపై మోడీ కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.  ఏపీలో టీడీపీ ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.  దేశాన్ని కాపాడేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.  

పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు తెలుసునన్నారు.  కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు కలిసి నడవడాన్ని  ప్రజలు కూడ ఆమోదిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.  కర్ణాటకలో మంగళవారం నాడు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలే  తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడ వస్తాయని ఆయన  అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి  కావడం కోసం కాంగ్రెస్ పార్టీ చీఫ్ ‌తో కలవడాన్ని ప్రజలు హర్షించరు. దేశం కోసం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో  కలిసినట్టు చెప్పారు.  అందుకే బాబు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు.