టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ధౌర్జన్యానికి దిగారు. గురువారం ఉదయం పార్లమెంటు ముఖద్వారం వద్ద ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు చేస్తున్న వైసిపి ఎంపిల దగ్గరకు జెసి వచ్చి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులను లాగిపడేశారు. వైసిపి ఎంపిలను నానా మాటలన్నారు. హోదా కోసం డ్రామాలాడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ‘దమ్ముంటే ఇపుడే ఎంపిల పదవులకు రాజీనామాలు చేయండి..మేము రాజీనామాలు చేయటానికి రెడీగా ఉన్నామం’టూ మండిపడ్డారు.

జెసి వైఖరితో వైసిపి ఎంపిలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. హోదా కోసం ఆందోళన చేస్తున్న తమపై జెసి వీరంగం వేయటంతో ఎంపిలు బిత్తరపోయారు. జెసి అసలేం చేస్తున్నారో కూడా వైసిపి ఎంపిలకు ముందు అర్ధం కాలేదు. రాజీనామాలపై జెసి సవాలుకు వైసిపి ఎంపిలు కూడా ధీటుగా ప్రతిస్పందించటంతో కొద్దిసేపు గందరగోళం చేసిన జెసి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. అసలు తమ వద్దకు జెసి ఎందుకు వచ్చారో? ఎందుకు వెళ్ళిపోయారో కూడా వైసిపి ఎంపిలకు అర్ధం కాలేదు.