విశాఖ రైల్వే జోన్‌పై ఎంపీ జేసి దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్ చిన్న అంశమే కానీ అది సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్నారు. అయితే రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారని ఎంపీ తెలిపారు. చంద్రబాబు అంటే మోదీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని వ్యాఖ్యానించారు. అన్నీ ఇస్తే చంద్రబాబు రాజకీయంగా ఎదుగుతాడని భయం ఉన్నట్టుందన్నారు. అందుకే హామీలు అమలు చేయడం లేదేమో? అని జేసీ అభిప్రాయపడ్డారు. హామీలు ఎలా సాధించుకోవాలో టీడీపీ ఎప్పుడో నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇవాళ కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.