ఈ అవిశ్వాసం మెజారిటీకి, మోరాలిటీకి జరిగే యుద్దం : గల్లా జయదేవ్

TDP MP Galla Jayadev Speech on parliament Over SCS Promise
Highlights

కేంద్ర ప్రభుత్వం ఏపిని నమ్మించి మోసం చేయడం వల్లే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న నూతన రాష్ట్రం ఏపికి అడుగడుగునా అన్యాయమే జరిగిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఏపిపై కపట ప్రేమను ప్రదర్శించిన బిజెపి పార్టీ ఆ తర్వాత అధికారంలోకి రాగానే తన నిజ స్వరూపాన్ని బైటపెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం, దీని ద్వారా కేంద్రం ఏపికి చేసిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ అవిశ్వాసం అనేది మెజారిటీకి, మోరాలిటీకి మద్య జరుగుతున్న యుద్దమని, ఇందులో నైతికంగా విజయం తమదేనని గల్లా జయదేవ్ అన్నారు.

నాలుగేళ్ల పాటు నాలుగు కేంద్ర బడ్జెట్ల సమయంలో కేంద్రం నుండి నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితే ఉండేదని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎపీకి ఎప్పుడూ అన్యాయమే చేసేదని గుర్తు చేశారు. అందువల్లే చివరకు ఎన్డీఏలో ఉన్న తమ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించి బయటకు వచ్చామని అన్నారు. అయితే అప్పటినుండి కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు గల్లా జయదేవ్.

స్పెషల్ స్టేటస్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఏపిని,టిడిపి పార్టీని నమ్మించి మోసం చేసిందన్నారు. ఏపి కి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడిగే అవకాశం ఉందని నమ్మబలికి, స్టేటస్ కి సమానమైన స్పెషల్ ప్యాకేజీని ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఈ ప్యాకేజీ కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గల్లా మండిపడ్డారు. అందువల్లే సీఎం చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారని, ఈ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఆయన పట్టించుకోలేదని అన్నారు. 
 
loader